Saturday 18 April 2015

"బతుకు పుస్తకం" ఆవిష్కరణ - రేపు సాయంత్రం రాజమండ్రిలొ... [ఆంధ్రజ్యొతి - 18 ఏప్రియల్ 2015]

"బతుకు పుస్తకం" ఆవిష్కరణ - రేపు సాయంత్రం రాజమండ్రిలొ...
[ఆంధ్రజ్యొతి - 18 ఏప్రియల్ 2015]





"బతుకు పుస్తకం" reprint(after 32 years) by Sri Sri Visweswar rao.
రచయిత బొమ్మ: Artist Anwar 



జీవిత చరిత్రలు, ఆత్మ కథలూ, స్వీయ చరిత్రలూ - ఇవన్నీ చదవడం వల్ల ఆయా వ్యక్తుల గురించే కాకుండా ఆనాటి సమాజ స్తితిగతులూ, పరిస్తితులూ, ఆచార వ్యవహారాలూ, రాజకీయ ప్రభావాలూ తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయి. అందుకనే శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు తన స్వీయ చరిత్రకు ' అనుభవాలూ- జ్ఞాపకాలూనూ ' అని పేరు పెట్టారు. 
శ్రీ ఉప్పల లక్ష్మణ రావు గారు దీర్ఘ కాలం సోవియేట్ దేశం లో ఉండడం వల్ల సాధారణ తెలుగు ప్రజలకు వారి గురించి ఎక్కువగా తెలీదు. కాని రశ్యన్ పుస్తకాల తెలుగు అనువాదాలు చదివే వారికి లక్ష్మణరావు గారు చిరపరిచితులు. ముఖ్యంగా సైన్స్ పుస్తకాలు చాలా తెలుగులోకి అనువదించారు.
అతడు-ఆమె నవల చదివితే చాలు లక్ష్మణరావు గారి వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుంది. స్త్రీ -పురుష సంబంధాలను చక్కగా వివరించారు.
వారి స్వీయ చరిత్ర ' బతుకు పుస్తకం ' కూడా మొదటి సగ భాగం ఆనాటి ఉత్తరాంధ్ర పరిస్తితులను, ద్వితీయ భాగం జర్మన్, సోవియెట్ దేశ పరిస్తితులను చక్కగా తెలుపుతుంది.
ఇది మొదట ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 30-10-1981 నుండి 31-12-1982 వరకు ప్రచురింపబడింది. పుస్తకం పేరు ఎంత సరళంగా ఉందొ వారి భాష కూడా అంతే సరళంగా ఉంటుంది. ఉదా: స్మ్రుతులు, గ్యాపక శక్తి, క్రుతగ్యుడ్ని, చల్ది అన్నం, తరవాణి మొ.వి.
ఈ ఏప్రిల్ 20 నాడు గుంటూరు సాహితీ మిత్రులు ' బతుకు పుస్తకం ' రీప్రింట్ తెస్తున్న సందర్భంగా ఈ పోస్ట్ చేస్తున్నాను.

by  డా. కోదాటి సాంబయ్య 













సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...