Wednesday 16 December 2020

కొండగాలీ కొత్త జీవితం

 కొండగాలీ కొత్త జీవితం (ఆర్మేనియన్ కథలు అనువాదం - నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, కేశవ గోపాల్ )

---------------------------------------------------------------
ఇవన్నీ పాతరోజులు. సోవియెట్ యూనియన్ వల్ల ఆ ఛత్రం కింద దేశాలన్నీ ఏ మేరకు లాభపడ్డాయో లేదో కాని పుస్తక ప్రపంచం మాత్రం విపరీతంగా లాభపడింది. ప్రపంచమంతా సోవియెట్ సాహిత్యం శుభ్రమైన అట్టలతో నాణ్యమైన ఫాంట్‌తో పరిమళాలీనే కాగితంతో సాహితీ ప్రేమికుల ఒళ్లోకొచ్చి పడింది. రాదుగ, ప్రగతి ప్రచురణాలయాలు రాళ్లెత్తకపోయినా పుస్తకాలెత్తి ప్రపంచమంతా కొత్త సాంస్కృతిక సౌధాలను నిర్మించడానికి కష్టపడ్డాయి. ‘కొండగాలీ కొత్తజీవితం’ 1979 నాటిది. ఇందులోని తొమ్మిది ఆర్మేనియన్ కథలు- ఆ ప్రశాంతమైన పర్వత ప్రాంత జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతాయి. ఒక దేశం గురించి, ఒక జాతి గురించి తెలియాలంటే ఆ జాతిని సరిగ్గా ప్రతిబింబించే సాహిత్యాన్ని చదవడమే మార్గం. కథ అంటే ఏమిటో , జాతి కలిగిన కథ అంటే ఏమిటో ఈ పుస్తకం చదివి తెలుసుకున్నారు చాలామంది.

ఆర్మేనియా- సోవియెట్ యూనియన్ కింద అంత సుఖంగా లేదన్నది వేరే విషయం. ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఫ్యాక్టరీల వల్ల తమ అందమైన దేశం కాలుష్యం బారిన పడుతోందని గగ్గోలు పెట్టింది. సోవియెట్ యూనియన్ పతనానికి ఒక సంవత్సరం ముందు- అంటే 1990లో అది స్వతంత్రం ప్రకటించుకుంది. ఇప్పుడు అక్కడి సాహిత్యం ఎలా ఉందో తెలియదు. మన దాకా చేరే మార్గం కూడా లేదు. కాని మిగిలిన ఇలాంటి అరాకొరా పుస్తకాలే దాచుకున్న గులాబీ రెమ్మలు. ఊహల్లో మిగిలిన ఆకుపచ్చ లోయలు.
[17 జనవరి 2014 - సాక్షి ]



సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...