ఆ రోజులు వేరు. ఆ పుస్తకాలు వేరు. పుస్తకాలతో ఊయలలూగిన ఆ కౌమారం, ఆ యవ్వనం మళ్ళీ రమ్మన్నా రాదు. సోవియట్ భూమి పత్రికల సందోహం మాక్సీమ్ గోర్కీ 'అమ్మ'తో తిరుగాడిన కాలం ఇంకా తాజాగా వున్న జ్ఞాపకం...
'గర్జించు రష్యా! గాండ్రించు రష్యా' అన్న శ్రీశ్రీ గీతాన్ని చదివి పరవశించిపోయి, ఆ రష్యా మీద ప్రేమను పెంచుకొని, సోవియట్ విప్లవం ఇక్కడ పునరావృతమయితే బాగుండని తలపోసిన రోజులు ఎంత మహత్తరమైనవి! ఎంత అద్భుతమైనవి!
రాత్రిళ్ళు బుడ్డిదీపం వెలుతురులో ఆ పుస్తకా లతో సాగించిన ప్రయాణం ఒక ఉద్విగ అను భూతుల సమాహారం.
పేదరికంలో వున్నామన్న స్పృహ లేదు.
పూరిగుడిసెలో బతుకు సాగుతుందన్న
దిగులు లేదు.
భవిష్యత్తు మీద బెంగ లేదు.
కెరీర్ మీద కలలు లేవు.
ఇంట్లో కరెంటు లేదన్న చింత లేదు.
నట్టింట్లో దరిద్రం తాండవిస్తుందన్న
ఎరుక అస్సలు లేదు.
ఏదో చేయాలి...
మార్పు దిశగా ప్రయాణించాలి.
పోరాడాలి. విప్లవించాలి.
సోవియట్ రష్యాలో జరిగిన విప్లవం ఇక్కడ కూడా పునరావృతం కావాలన్న కలలు... కలలు...
కౌమారం నుంచి తొలి యవ్వనంలోకి...
యవ్వనప్రాయంలోకి...
విద్యార్థి ఉద్యమాల్లోకి...
క్లాసులో వున్నా, లైబ్రరీలో వున్నా, ఇంటికి వచ్చినా చేతిలో ఎప్పుడూ ఒక సోవియట్ పుస్తకం...
పుష్కిన్, మాక్సీమ్ గోర్కీ, టాల్‌స్టారు, తుర్గే నేవ్, చింగీజ్ ఐత్మాతోవ్, లేర్మొంతవ్, షోలకోవ్ వంటి రచయితలతో స్నేహం... వారి ప్రపంచాల్లోకి ప్రయాణిస్తున్నంత సంరంభం.
వంతెన మీద కూర్చుని ఆ పుస్తకాల గురించీ, ఆ పుస్తకాల్లోని పాత్రల గురించీ దోస్తులతో చర్చోపచర్చలు...
అమ్మకు 'అమ్మ'ని
వినిపించాలన్న ప్రయత్నాలు...
మిత్రురాలితో 'జమీల్యా'
గురించిన ముచ్చట్లు...
టాల్‌స్టారు 'యుద్ధం-శాంతి, అన్నా కెరీనీనా, కోసక్కులు' మీద ఎన్నో రాత్రుల్లో... ఎన్నెన్నో రకాల సంభాషణలు... ఆ పాత్రలతో సంలీనమై, ఆ సన్ని వేశాలతో మమేకమై... ఆ రచయితల ఆత్మ లోకాల్లోకి ప్రయాణించాలన్న ఆరాటం. టాల్ స్టారు మీద ఎనలేని మమకారం. ఏమాత్రం విసుగు అనిపించకుండా టాల్‌స్టారు సృజించిన సన్నివేశాల్లోకి ప్రయాణించడం అపురూప అను భవం. పొలాల గురించీ, వ్యవసాయం గురించీ ఆయన పేజీల కొద్దీ రాస్తే ఆ వాతావరణంలోకి, ఆ కాలాల్లోకి ప్రయాణించినప్పటి లేలేత జ్ఞాపకాలు ఇంకా తాజాగానే వున్నాయి.
నిజంగానే చిరిగిన చొక్కాలే వేసుకుంటూ అయిదు రూపాయలు పెట్టి 'అమ్మ' పుస్తకం కొనుక్కున్న రోజులున్నాయి. చిరిగిన చొక్కా వేసుకున్నాననే దిగులు లేదు. కాళ్ళకు తెగిన స్లిప్పర్లని వేసుకుంటూ, వాటిని పావలా పెట్టి రిపేరు చేయించుకునే రోజుల్లో రూపాయి పెట్టి 'కమ్యూనిస్టు ప్రణాళిక' కొన్నప్పటి అనుభూతి మరల మరల రాదు. దానిని కవిత్వమంతా పరమ ఇష్టంగా, ప్రేమగా చదివి, ఉత్తేజం పొంది... గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వంద రూపాయలు డోనేషన్ కట్టాలన్న ప్రతిపాదనకు వ్యతి రేకంగా ఉద్యమించిన రోజులు... అది విజయం సాధించిన స్మృతులు... ఎంత ఉద్దీపన! ప్రపంచాన్నే గెలిచేస్తామన్న ధీమా! ఆ ధీమాను ఇచ్చిన కమ్యూనిస్టు ప్రణాళిక ఒక ఆరాధ్య గ్రంథం. సోవియట్ పుస్తకాల పరంపరలో అదొక అపురూప కానుక.
ఆ ఉత్సాహం, ఊపులోనే లెనిన్ జీవితకథ, కార్ల్‌మార్క్స్, ఎంగెల్స్ జీవితచరిత్రలు, సోవియట్ విప్లవగాథలు... పిల్లల జానపద గాథలు.. అనే కానేక కథలు, నవలలు... కనిపించిన ప్రతి సోవియట్ పుస్తకాన్ని ఆబగా చదువుతూ పోయిన రోజులు.. ఎగసిపడిన ఉత్సాహ తరంగాలు. చద వడం కోసమే చదవడం. ఏదో వికాసం కోసమో, విజయం కోసమో సాగిన అధ్యయనం కాదు. చదవ కుండా ఉండలేక చదివిన కాలమది. చదివించిన సోవియట్ సృజనశీలుర పుణ్యమది. ఆ చదువుకు లక్ష్యం లేదు. ప్రణాళిక లేదు. ఎవరో చెప్పింది కాదు. ఏ విమర్శకులో, సమీక్షకులో సిఫారసు చేసిందీ లేదు.
సోవియట్ పుస్తకమంటే చాలు, ఆబగా చదివే యాలన్న ఆరాటం తప్ప మరేం లేదు. సూర్యాపేట లో ఎన్.జి.రెడ్డి 'స్టార్ బుకహేౌస్'లో, శాఖా గ్రంథా లయంలో, దోస్తుల దగ్గర వున్న సోవియట్ పుస్తకా లని ప్రేమ ప్రేమగా చదువుకోవడం ఒక నిరంతర వ్యాపకం.
లక్ష్యం, విజయం, కెరీర్, ఉపాధి, భవిష్యత్తు వంటి పదాలు బొత్తిగా ఎరుగని రోజులవి. ఆ పుస్తకాల జ్ఞానం ఏమిచ్చిందని సమీక్షించుకోవాలన్న చింత ఇప్పుడూ లేదు.
చదవడం జీవితంలో
అనివార్యమైన అంతర్భాగం.
చదవడం బతుకును వెలిగించిన అనుభవం.
బతుకు సారాన్ని తెలియజెప్పిన అధ్యయనం.
మనిషిగా మిగలడానికి తోడ్పడిన సోపానం.
చదవడమే జీవితంగా తలపోసిన సందర్భం.
అదొక ఆరోగ్యకరమైన వ్యసనం.
వ్యసనమని కూడా తెలియకనే
అలవడిన వ్యసనం.
అది సోవియట్ పుస్తకాల మహత్తు.
ఆ కాలపు ఇంద్రజాలం.
నాటి రోజుల్ని తలుచుకుంటే ఇలాంటి భావనా పరంపర ఏదో ముప్పిరి గొంటుంది. 'ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా...' అన్న తిలక్ కవిత గుర్తు కొస్తుంది. ఆ రోజులే కాదు, ఈరోజులూ సోవియట్ పుస్తకాలకు అనువైన కాలమే. వాటిని ఎవరు ఎలా అందుకుంటారో, కొనసాగింపు ఎలా ఉంటుందో ఇప్పుడే తీర్పులు చెప్పనేల!?
ఇవాళ పుస్తకాలు చదవండి, మీ కెరీర్ కోసం అధ్యయనం అవసరం, రోజుకో అరగంట చద వండి, పిల్లల కోసం పుస్తకాలు కొనండి, పిల్లలతో పాటు చదవండి అని టిప్స్ రాస్తుంటే, ఉద్బోధలు చేస్తుంటే నవ్వొస్తుంది. చెబితే వచ్చే అలవాటు కాదు అది. అయ్య అమ్మలు కొనిపెడితే చదువుతారా? చదవాలన్న యావ లోలోపల వుండాలి. అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు. చూద్దాం... చరిత్ర పునరావృతమవుతుందంటారు. ఇది సోవియట్ పుస్తకాలకు మాత్రం వర్తించదా!
(జ్ఞాపకాల్ని తట్టి లేపిన అనిల్ బత్తులకు కృతజ్ఞతలతో...)
- సంజీవి