|
Address:
Manchi Pustakam,
12-13-439,
St. No.1,
Tarnaka,
Secunderabad.
PIN: 500 017
Website: www.manchipustakam.in
E mail: info@manchipustakam.in
Contact:
P. Bhagyalakshmi:94907 46614
K. Suresh :73822 97430
సోవియట్ పిల్లల పుస్తకాలతో కొన్ని తరాలు పెరిగాయి. తక్కువ ధరకు దొరకటమే కాకుండా చక్కటి కథలు, అంతకంటే మంచి బొమ్మలు ఉండటం వీటి ప్రత్యేకత. వీటి ప్రభావంతో ఎంతోమంది పుస్తక ప్రేమికులైతే, కొంతమంది రచయితలు, చిత్రకారులు అయ్యారు. మంచి పుస్తకం తరఫున ఇప్పటివరకు 40కి పైగా సోవియట్ పిల్లల పుస్తకాలను మళ్లీ ప్రచురించాం. రాదుగ, ప్రగతి వంటి ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురించిన సోవియట్ పిల్లల పుస్తకాలను సేకరించటం మొదలుపెట్టాం. దీనికి విజయవాడలోని వికాస విద్యావనం పాఠశాల, గంగాధరం - వల్లి గార్లు వంటి ఎంతో మంది సహకరించారు. అయితే, ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు కనపడుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల రెడ్డి రాఘవయ్య గారు ఫోను చేసి నా దగ్గర సోవియట్ పిల్లల పుస్తకాలు ఉన్నాయి మీకు ఉపయోగపడతాయేమో చూడండి అన్నారు. రెడ్డి రాఘవయ్యగారి దగ్గర ఎంతో విలువైన పిల్లల పుస్తకాలే కాకుండా తెలుగు సాహిత్యంలో పేర్కొనదగ్గ వారి సమస్త రచనలు ఉన్నాయి.
వారు చూపించిన పుస్తకాలలో కొన్ని మేం తిరిగి ప్రచురించినవి ఉన్నాయి, కొన్ని మా దగ్గర ఉన్నవి ఉన్నాయి. వారు అపురూపంగా దాచుకున్న వాటిల్లోంచి కొన్ని పుస్తాకలు నేను తెచ్చుకున్నాను. అందులోంచి రెండింటిని మంచి పుస్తకం తరఫున మళ్లీ ప్రచురించాం. ఇంతకుముందు పోస్టులోని చిన్నారి కోడిపుంజు ఒక పుస్తకం. రెండవది 'నక్కా, చుంచుపిల్లా'. A4 సైజులో 12 పేజీల కథ. పేజీకి ఒక లైను, అది కూడా లేకపోయినా అర్థమయ్యే కథ. ఈ పుస్తకాలు ఎప్పుడు ప్రచరితమయ్యాయన్న వివరం వాటిల్లో లేవు. కానీ 1971లో కొన్నట్టు రెడ్డి రాఘవయ్య గారు వాటిల్లో రాసుకున్నారు. అంటే కనీసం 46 ఏళ్ల నాటి పుస్తకాలు అవి.
https://goo.gl/VTqTPa
https://goo.gl/VTqTPa
Note: Books will be sent to anywhere, subject to postal charges.
పిల్లల్లో చదివే అలవాటు పెంపొందించటానికి ఒక ఇంగ్లీషు పోస్టరును రెండు సంవత్సరాల క్రితం చూశాను. అది బాగా నచ్చింది. దాని ఆధారంగా తెలుగులో పోస్టరు చెయ్యాలనుకున్నాను. దీనికి అభ్యాస కృష్ణ బొమ్మలు వేసి ప్రాణం పోశాడు. దీనిని హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనలలో మంచి పుస్తకం స్టాల్లో పెట్టాం.
పిల్లల్లో చదివే అలవాటు పెంపొందించటానికి ఒక ఇంగ్లీషు పోస్టరును రెండు సంవత్సరాల క్రితం చూశాను. అది బాగా నచ్చింది. దాని ఆధారంగా తెలుగులో పోస్టరు చెయ్యాలనుకున్నాను. దీనికి అభ్యాస కృష్ణ బొమ్మలు వేసి ప్రాణం పోశాడు. దీనిని హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనలలో మంచి పుస్తకం స్టాల్లో పెట్టాం.