Sunday 9 September 2018

Tolstoy birthday by TRC- photos

అసలే ఆదివారం ఉదయం. అందులోనూ అనుకోకుండా ముందురోజు మారిపోయిన వెన్యూ. అవిష్కరించే కొత్త పుస్తకాలేం లేవు. పలానావాళ్ళు సభలో మాట్లాడతారని ముందుగానే చెప్పలేదు. రాదుగ పుస్తకాలు చూడటానికి అసలెవరైనా వస్తారా అని లోలోపల ఏదో చిన్న అనుమానం. బ్యానర్లు కట్టాను. మంచి సోవియట్ పుస్తకాల కవర్ పేజీలు ఎంచుకుని పోస్టర్లు ప్రింట్ చేయించి అతికించాను. పుస్తకాల రాక్ లు తెప్పించి అన్ని పుస్తకాలూ అందరికీ కనిపించేలా సర్దాను. వీక్షకులు వస్తారా రారా అని టెన్షన్. ఒక్కడ్నే ఎదురుచూస్తూ కూర్చున్నాను. చివరికి ఆర్టిస్ట్ శివాజీ గారు అడుగులో అడుగేసుకుంటూ టాల్ స్టాయ్ కోసం వచ్చారు. సంతోషంతో కౌగలించుకున్నారు. పీకాక్ గాంధి గారు ఎక్కడ్నుంచో అకస్మాత్తుగా ప్రత్యక్షం అయ్యారు. ఆరోగ్యం బాలేకున్నా కడుపు గంగాధర్ గారు క్యాబ్ బుక్ చేసుకుని నీకు నేనున్నాను అంటూ ప్రత్యక్షం. చివరికి టాల్ స్టాయ్ అందర్నీ రప్పించాడు. టాల్ స్టాయ్ జన్మదిన సందర్భంగా ఈ ఉదయం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సోవియట్ ప్రదర్శన ఆహ్లాదకరంగా జరిగింది. ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యం, బొమ్మలు గీయడంలొ ఆసక్తి చూపుతున్న ప్రసాద్ సూరద, ఈటీవిలో పనిచేసే రామకృష్ణ వంటి యువతరం ఔత్సాహికుల దగ్గరనుంచి రాదుగ పుస్తకాలతో చక్కటి అనుబంధం ఉన్న పీకాక్ క్లాసిక్స్ గాంధి, ఆర్టిస్ట్ శివాజి, కడుపు గంగాధర్, మందలపర్తి కిషొర్, ఛైతన్య వేదిక[ఏలూరు] అధ్యక్షులు చందు గారు లాంటి సీనియర్లూ ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొని తమ అనుభవాలను సందర్శకులతో పంచుకున్నారు. అంతేకాక ప్రసిద్ధ చిత్రకారులు ఆర్టిస్ట్ అన్వర్, ఆనంద్, రమాకాంత్ వంటి చిత్రకారులు ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చి పిల్లల బొమ్మల పుస్తకాలను ఆసక్తితో పరిశీలించడం ఆనందం కలిగించిన విషయం. యుద్ధము శాంతి, అన్నా కరెనినా వంటి నవలలు సృష్టించిన టాల్ స్టాయ్ భుజబలం ఎంతటి శక్తివంతమైనదో కథకులు టైటానిక్ సురేష్ వివరించి చెప్పారు. పిల్లల బొమ్మల పుస్తకాలు, టాల్ స్టాయ్, గోర్కి, కుప్రిన్, లెర్మంతోవ్ వంటి మహారచయితల పుస్తకాలని ఆహుతులందరూ ఆసక్తిగా పరిశీలించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
పుస్తక ప్రేమికులకు ఇంతకంటే ఏం కావాలి.


















సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...