Thursday 14 May 2015

లెనిన్ సెంటర్లో ఉక్రేనియన్ జానపద గాథలు.... పట్టేశా! by Sujatha [Blogger]

This below blog post and comments inspired me to collect Soviet telugu books...Heartfull thanks to Blogger Sujatha garu.

Courtesy: http://manishi-manasulomaata.blogspot.in/2010/05/blog-post.html


[This Blog is for invited readers only], Thanks to Sujatha garu.

మాస్కో "రాదుగ" ప్రచురణాలయం వాళ్ళ పుస్తకాలు భలే ఆకర్షణీయమైన తెలుగు ఫాంట్ తో, మంచు కురిసే రష్యా అందాల్ని ఆవిష్కరిస్తూ, బోలెడంత ముద్దొస్తూ ఉంటాయి. రాదుగ ప్రచురణాలయం మూత పడిందని తెలిసినపుడు వాళ్ళ పుస్తకాలన్నీ చదువుతూ పెరిగిన మేము(నేను, నా కజిన్సూ) "రాదిక నీ కోసం చెలీ..."రాదుగ" వసంత మాసం! ఇక రాదుగా"అని విషాద గీతాలు పాడేసుకుని సరిపెట్టుకున్నాం!అప్పటివరకూ వచ్చిన పుస్తకాలేవీ జాగ్రత్త కూడా పెట్టుకోలేదు. అలా పోగొట్టుకున్నదే ఉక్రేనియన్ జానపద గాథలు పుస్తకం. 

పోగొట్టుకున్నది వెదుక్కోడానికేగా! అందుకే అప్పటినుంచి పట్టు వదలని విక్రమార్కుడి చెల్లెల్లా విశాలాంధ్ర బ్రాంచీలన్నీ వెదికాను.
వాళ్ళకు నా కంటే నిర్లక్ష్యం!
"మా దగ్గర లేదు. ఎక్కడ దొరుకుతుందో మాకు తెలీదు పొండెహె"అని భలే మర్యాదగా చెప్పారు.
అలాగే నేను గత పదిహేనేళ్ళుగా వెదుకుతున్న మరో అద్భుతమైన పుస్తకం ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా రాసిన "ఎర్త్" కి సహవాసి గారి అత్యద్భుత అనువాదం "భూమి" నవల. అది మా వూరి లైబ్రరీలో చదివాక ఎలాగైనా సంపాదించాలనుకున్నాను.హైద్రాబాదు బుక్ ట్రస్ట్ వారు 1983లో వేశారు దాన్ని. వాళ్ళ దగ్గర అడిగితే "మా వద్ద కూడా ఒకటే కాపీ ఉంది.జిరాక్స్ కాపీ కావాలంటే ఓకే"అన్నారు.కానీ నాకు ఫొటోస్టాట్ కాపీల మీద అంతగా ఆసక్తి లేక ఊరుకున్నాను. ఒరిజినల్ నా లైబ్రరీలో ఉండాలనే స్వార్థం! 
విజయవాడ లెనిన్ సెంటర్ లో కూడా రెండు మూడు సార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అక్కడ అరుదైన పుస్తకాలు లభించే వంశీ బుక్ స్టోర్స్ యజమాని జగన్మోహనరావు(నాగేశ్వర రావుగా అందరికీ పరిచితులు)గారు కూడా "అవెక్కడ దొరుకుతాయమ్మా! లాభం లే"దన్నారు.



ఇక్కడ రెండు ముక్కలు ఆయన గురించి చెప్పుకోవటం విధాయకం! పాత పుస్తకాలమ్మే షాపులు ఎన్నైనా ఉండొచ్చు కానీ సాహిత్యాభిరుచి ఉండి,అరుదైన పుస్తకాలు ఆసక్తి ఉన్నవాళ్ళకు అందుబాటులోకి తేవాలన్న తపన ఆయన ఒక్కరిలోనే కనిపిస్తుంది.ఏ పుస్తకం గురించి అడిగినా దాని పూర్వ చరిత్ర మొత్తం చెప్పగలరు.ఎంతోమంది వారికి కావలసిన అరుదైన పుస్తకాల గురించి అక్కడికి వస్తుండటమే కాక "మొన్న అడిగిన పుస్తకాలు వచ్చాయా"అని ఫోన్లు చేస్తూ ఉంటారు.
గ్రంథ సేకరణ చేసేవారి అనుభవాలను ఆయన గ్రంథస్థం చేసే పనిలో ఉన్నారు.


చివరికి ఆ రెండు పుస్తకాలు,...... ఏవి?....ఉక్రేనియన్ జానపద గాథలు, మరియు "భూమి" చక్కటి చెక్కుచెదరని స్థితిలో(వంశీ స్టోర్స్ లో కాకపోయినా)లెనిన్ సెంటర్లోనే నాకు దొరికాయి. 
దొర్లే బఠానీ గింజ
రైతు కొడుకు ఇవాన్,
వింత చేతి గొడుగు
శ్రీమాన్ మార్జాలం,
చక్రవర్తి అయిన సింహం,
నక్కచెల్లి-తోడేలు అన్న,
లైమ్‌చెట్టూ-ఆశపోతు ముసలావిడ ఇంకా మర్చిపోయిన అనేక కథలు ఈ ఉక్రేనియన్ పుస్తకంలో ఉన్నాయి.
"ప్రపంచంలో ఉన్న కథలన్నీ చెప్పేశాను, ఇక నా వల్ల కాదు నీతో" అని మా అమ్మాయితో గొడవ పడుతున్న శుభవేళ ఈ పుస్తకం దొరకడం అదృష్టమే!
"భూమి" అయిపోతుందేమో అన్నంత అపురూపంగా రోజుకోపేజీ చదువుతున్నాను.(మళ్ళీ ఇంకో ఎడిషన్ పడకపోతే ఇక అది నాకు ఎప్పటికీ దొరకదనే నమ్మకంతో ఉన్నాగా మరి ఇప్పటివరకూ) అది ఎలాగూ ఎవరికీ దొరకదు కాబట్టి చదవడం పూర్తయ్యాక ఇక్కడే దానిగురించి రాస్తాను.
ఇంతమంచి అరుదైన విలువైన పుస్తకాలు దొరికేందుకు సహకరించిన మంచి మిత్రులకు బోల్డన్ని థాంక్యూలు!

34 comments:

వేణు said...
‘పుస్తకాలంటే ఇలా ఉండాలి’ అనుకునేలా అందంగా, శ్రద్ధగా ‘రాదుగ’ ప్రచురణాలయం వారు పుస్తకాలు వేశారు. సాహిత్యం, సైన్స్, గణితం.. ఇలా ఏది చూసినా అద్భుతమైన పుస్తకాలే!

వాటి గురించి తల్చుకోవడమూ, అవి ఉన్న పాఠకాభిమానుల అదృష్టానికి సంతోషించడమూ మాత్రమే ఇప్పుడు చేయగలిగింది!

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి కూడా చాలా గొప్ప పుస్తకాలు వచ్చాయి. ‘భూమి’లాంటి పుస్తకాలను వాళ్ళు పున: ప్రచురణ చేస్తే ఇప్పటితరానికి కూడా ఎంతో మేలు చేసినట్టవుతుంది.

అరుదైన పుస్తకాలు లభించినందుకు మీకు అభినందనలు!
venkat said...
ఓహ్ దొరికిందా, మీరు నిజంగానే విక్రమార్కిణి అండి :)
పద ప్రయోగం నచ్చకుంటే లైట్ తీస్కొండి మన తెలుగు కొంచెం వీకు
ఎస్పీ జగదీష్ said...
నేను కూడా రష్యన్ పుస్తకాలంటే పిచ్చి. విశాలాంద్ర వారి దగ్గరున్న మొత్తం పుస్తకాల కలెక్షన్ అంతా నా దగ్గర వున్నది. "మాయ గుర్రం మేటి గుర్రం", "ఉక్రేనియన్ జానపద గాధలు" ఇవన్నీ ఎప్పటికీ హైలైట్స్. లెనిన్ రాసిన "పిల్లల కధలు" ఎక్కడయినా దొరుకుతుందేమో చెప్పండి... ప్లీజ్. ఎవరో తీసుకుపోయి, మరలా ఇవ్వలేదు. అప్పటి నుండి ఎవరయినా అడిగినా లేదని చెప్పేస్తున్నాను.
veeraiah said...
can we have scan copy posted please... all my stories also got exhausted.... more stories are needed because of the summer holidays... please..
balu said...
Ajeya sainikudu & prasata pratyushalu kooda chadavalsina daachu kovalsina books
శివ said...
మీ దగ్గర దిటవు గుండెలు, కుక్ గేక్ అన్నదమ్ముల కథ, వర్షంలో నక్షత్రాలు ఉన్నాయా. అద్భుతమైన పుస్తకాలు అవి.
Krupal kasyap said...
ముత్య మిత్రుడి మహిమాను సారం న చిత్తాను సారం .. నాకు ఒక్క సారి సేల్డ్జి బండిమీద ఎక్కాలని వున్నది , we need to scan these classics and make it available to public
గీతాచార్య said...
పుస్తకం నాకు కావలెను. ఫొటోశ్టాట్ ఐనా సరే
చెరసాల శర్మ said...
దిటువు గుండెలు పుస్తకం మార్కెట్ లో దొరుకుతుంది. ఆ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ లో కొన్నాను.
సుజాత said...
చెరసాల శర్మ,
నిజమా? దిటవు గుండెలు ఎప్పుడు కొన్నారు అక్కడ? ఏడాది క్రితం అడిగితే అప్పటిపుస్తకాలేవీ లేవన్నారే ప్రజాశక్తి వాళ్ళు?
సుజాత said...
ఎస్పీ జగదీష్,
మీరు అదృష్టవంతులు.అన్ని పుస్తకాలూ మీ దగ్గర ఉన్నాయంటే!లెనిన్ పిల్లల కథలు రాశాడా? అయితే పట్టేస్తా లెండి! (ఫ్రెండ్స్ మీద నమ్మకం! ఎలాంటి పుస్తకాన్నయినా సంపాదించి పెట్టే స్నేహితులున్నారు నాకు)
వేణు said...
‘దిటవు గుండెలు’ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో సోవియట్ గెరిల్లాల వీరగాధ ఇది. ద్వీత్రియ్ మెద్వెదేవ్ రష్యన్లో ఈ వాస్తవిక నవల రాశారు. ఉప్పల లక్ష్మణరావు గారు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకం చాలాకాలం పాటు తెలుగుపాఠకులకు అందుబాటులో లేకుండా పోయింది.
2007 జనవరిలో ‘ప్రగతి ప్రచురణల’ తరఫున రంగనాయకమ్మ గారు దీన్ని అందుబాటులోకి తెచ్చారు. పుస్తకం వెల 30 రూపాయలు. కాపీల కోసం- నవోదయా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ను సంప్రదించవచ్చు. ఫోన్- 040-24652387.
చెరసాల శర్మ said...
నేను దిటువు గుండెలు పుస్తకం ప్రజాశక్తి బుక్ హౌస్ విశాఖపట్నం బ్రాంచ్ లో కొన్నాను.
Heart Strings said...
nenoo russian pillala katha pusthakaalu chadivi periginadanne. chinnappudu, shankermutt daggara shamiyaana vesi ammevaaru,maa illu akkadiki daggarlone undatam valla, almost roju velladam, konukkovatam, chadavatam aipogaane mallee vellatam, kanee nenu avi enduko antha jagratta parachukoledu, chaala konne migilayi naa daggara, dantlo okati-erra puvvu raaja kumaarudu. ippudu meeru konna pusthakaalu hyd lo ekkada dorukuthayo cheppagalara please!!!!
వేణూ శ్రీకాంత్ said...
మీ పుస్తక ప్రేమకు మరోసారి టోపీతీసేస్తున్నా :-) Hats off...
మిర్చి said...
వేణు గారూ, మీరు ఈనాడులో ఏమన్నా పని చేస్తారా?

Faustin Donnegal
Satyavati said...
sujatha garu
mee blog lo nundi konni puskta sameekhsalu bhumika kosam teesukovacha?
meeru bhumika kosam kooda book reviews cheyyochu kada?
కౌటిల్య said...
సుజాత గారూ...వంశీ బుక్ స్టాల్ అతను నేను మాంఛి పరిచయస్తులం....నేను ఆయన దగ్గర ఎన్ని వేలకి పుస్తకాలు కొన్నానో....ఎంత అరుదైన పుస్తకమైనా అక్కడ తప్పక దొరుకుతుంది...చక్కగా బైండింగ్ చేసి మరీ ఇస్తారు...
Sreenivas Paruchuri said...
"ఉక్రేనియన్ జానపద గాథలు" వంశీ బుక్‌స్టాల్‌లో వుండేది. డిసెంబర్ 2009 మొదటి వారం వరకు :-). అలాగే ఈ రెండు పుస్తకాలు కూడా:
ఇ. కజకేవిచ్ రచన "మిత్రుని హృదయం" (అను: గిడుతూరి సూర్యం), ఎ. కుప్రీన్ రచన "రాళ్ళవంకీ కథలు" (అను: ఆర్వీయార్). దొరికేవరకు మళ్ళీ మళ్ళీ కాలవ వొడ్డుకి వెళ్తుండటమే! :)

-- శ్రీనివాస్
Ramu S said...
మిర్చి గారూ..
వేణు గారు ఈనాడు ఇంత తీరిగ్గా ఉన్నారేమిటా? అనా మీ సందేహం? లేక ఆయన చేస్తున్న పని గురించి, ఆ పని తీరు గురించి తెలుసుకోవాలని ఉందా?
రాము
apmediakaburlu.blogspot.com
aidso said...
where shall I get Ajeya sainukudu & Prasantha Prathyushalu?

It is in which publication?
In which Book shop we can get it?
Pl. Inform to us.
Anil Reddy said...
‘రాదుగ’ ప్రచురణాలయం పుస్తకాలు still available:

Place: vishalandhra book house,Sulthan bazar, Koti, Hyderabad

Some book names: 1.Kalatapasvi yogin
2.chettu etc..

Will they sell: NO.

What they are doing with those great books? : They are using these great books as base for other books..like how we use old news papers in shelves..in that way...I found nearly 30 books of Radhuga prachuranalayam 2 days back.

But they told that they wont sell..they are calling those golden books as "Attalu" ..support sheets...so sad...

adi mana pusthakalayala Situation..that is the imp that they r giving...
Anil Reddy said...
రాదుగా పుస్తకాల అభిమానులకు శుభ వార్త!
"ఉక్రేనియన్ జానపద గాథలు" (అను: ఆర్వీయార్) ను "విశాలాంధ్ర" వాళ్ళు ఈ మధ్యే రేప్రింట్ చేసారు.
వేల: 95 రూపాయలు . విశాలాంధ్ర ఆబిద బ్రాంచ్ లో దొరుకుతుంది....దొంత మిస్.....

రాదుగా పుస్తకాల అభిమాని..అనిల్
Anil Reddy said...
This comment has been removed by the author.
Anil Reddy said...
రాదుగా పుస్తకాల అభిమానులకు శుభ వార్త!
"MANCHI PUSTHAKAM" reprinted RADHUGA PRACHURANALAYAM children books:
some of the titles:
1.Bulli matti illu
2.Ukranian janapada gadhalu(devided into 4 books set)
3.Gunde kagada(maxim gorky)
4.Nakka-kundelu
5.Leo tolstoy balala kathalu..and many more...

They areconducting a stall in HYDERABAD BOOK EXHIBITION-2012 which start from DEC 14th at naclace road, Hyderabad.

Dont miss this golden opputunity:
Another interesting news is: they are printing 3000 copies of each book...:) good news...
IF YOU WANT TO PURCHASE THE BOOKS, PLEASE CONTACT BELOW ADDRESS:
MANCHI PUSTHAKAM,
12-13-439,
STREET NO:1,
TARNAKA, SECBAD-500017
PHONE: 9490746614,
www.manchipustakam.in
info@manchipustakam.in
sarath said...
కథలు చెప్పే మమ్మీ దొరికిన మీ పాప ఈ తరమ్లో ఒక అదృష్టజీవి. :)
Chandana Ghali said...
erra puvvu pustakam nenu chinappudu chadivanu ippudu ekkada dorukutundo cheppagalaru.yenno book shops lo vetikanu ekkada dorakaledu
Chandana Ghali said...
Freinds...Pl give me information about where the book ERRA PUVVU will available..?
Anil Reddy said...
I have a good news for all RUSSIAN CHILDREN BOOKS FANS:

Manchipusthakam reprinted RADUGA vari "ALEESKA" [Abridgee version]; prize:45/-

Grab the golden book..
IF YOU WANT TO PURCHASE THE BOOKS, PLEASE CONTACT BELOW ADDRESS:
MANCHI PUSTHAKAM,
12-13-439,
STREET NO:1,
TARNAKA, SECBAD-500017
PHONE: 9490746614,
www.manchipustakam.in
info@manchipustakam.in
Chandana Ghali said...
Anil garu....chala thanx andi..meru mention chesina 'manchi pustakam' address ki mail pettagane ventane vallu books pampincharu. chala chala thanx andi.
Anil Reddy said...
thats fine Chandana garu...

Dear Raduga childrenbooks fans,

Lenin centre lo, jagan mohan rao gari daggara ఉక్రేనియన్ జానపద గాథలు పుస్తకం , naku kooda dorikindoch...2 days ago....am so happy to see the original..it has 250 pages, 26 stories..all multi colour pictures...thanks to sujatha garu for inspiring me to collect this book and soviet literature....

Anil Reddy said...
Nenu kooda లెనిన్ సెంటర్లో ఉక్రేనియన్ జానపద గాథలు.... పట్టేశా!..jagan mohan rao gari daggara..2 days ago...thanks to sujatha garu for inspiring me thru this blog post to collect soviet literature...

అనిల్ బత్తుల said...
Chandana Ghali గారు, మీరు ఎప్పటినుండొ వెతుకుతున్న "ఎర్ర పువ్వు" పుస్తకం దొరికినట్లె. SP.జగదీష్ గారు సాయం చెస్తామన్నారు.
Please visit my blog for "సోవియట్ తెలుగు పుస్తకాలు":
http://sovietbooksintelugu.blogspot.in/

Kesapragada Murthy said...
నేను కూడా జగన గారి దగ్గర చాలా పుస్తకాలు కొన్నాను.ఏ బుక్ కావాలన్నా ఫోన్ చేసి అడగగానే వుందో లేదో ,ఒక వేళ లేకుంటే ఆ పుస్తకం తన దగ్గరకు రాగానే బుక్ వచ్చిందని చెబుతారు.

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...